Page Loader
MP Ramulu: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు 
MP Ramulu: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు

MP Ramulu: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు 

వ్రాసిన వారు Stalin
Feb 28, 2024
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ లోక్‌సభ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. వాస్తవానికి ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. తొలుత ఆయన కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లు అందరూ అనుకున్నా.. చివరికి ఆయన బీజేపీ గూటికి చేరారు. టీడీపీ తరఫున అచ్చంపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా రాములు గెలిచారు. 1999-2004 మధ్య చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాములు.. 2016లో టీఆర్‌ఎస్లోకి వెళ్లారు. 2019లో నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన రాములు