Nalgonda-Loksabha-Candiate-BRS: నల్లగొండ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి మార్పు?
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ ఎస్(BRS) పార్టీ లోక్ సభ(Lok Sabha)ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తోంది.
చావో రేవో వంటి యుద్ధంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న సంకల్పంతో బీఆర్ ఎస్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది.
అందుకు అభ్యర్థుల్ని సైతం మార్చి వేస్తోంది.
తాజాగా నల్గొండ(Nalgonda)పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా బీఆర్ ఎస్ కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించగా..బీఆర్ ఎస్ అంతర్గత సర్వే(Survey)ల్లోనూ, క్షేత్రస్థాయిలో ను ఆయన బలహీనంగా ఉన్నట్లు తేలింది.
దీంతో ఎలాగైనా అభ్యర్థిని మార్చి ఆ సీటును గెలుచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
ఈ నియోజకవర్గానికి ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ ఎస్ , బీజేపీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ ఎస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచినట్లు సర్వేలో గులాబీ బాస్ చేయించిన సర్వేలో తేలింది.
Nalgonda-BRS
రెండు మూడు రోజుల్లో ప్రకటన?
ఒకటి రెండు రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అభ్యర్థి మార్పు ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కాగా కంచర్ల కృష్ణారెడ్డి స్థానంలో మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నప్పరెడ్డిని తీసుకొస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈయననే ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారా లేక కొత్తవారికెవరికైనా అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి.