Congress:'మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి': సావర్కర్ కళాశాల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో హౌసింగ్, విద్యా రంగం సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా, నజాఫ్‌గఢ్‌లో రూ.140 కోట్లతో నిర్మించనున్న వీర్‌సావర్కర్ కళాశాలకి శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
అయితే, ఈ కార్యక్రమం నేపథ్యంలో బీజేపీ,కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది.
కాంగ్రెస్ నేతలు, వీర్ సావర్కర్ బ్రిటీష్ అధికారుల పట్ల క్షమాపణలు చెప్పి, వారికీ పింఛన్లు పొందినట్లు ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తి పేరును కళాశాలకు పెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు.
వివరాలు
బీజేపీపై విమర్శలు చేసిన రాజ్యసభ ఎంపీ హుస్సేన్,
ఎన్‌ఎస్‌యూఐ నేతలు, దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేసిన దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఈ కళాశాల పేరు పెట్టాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు.
వారు, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు, ఆయన ఆర్థిక సంస్కరణలకు గుర్తుగా ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే, రాజ్యసభ ఎంపీ హుస్సేన్,బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేసారు.
ఆయన,బ్రిటీష్ వారికి క్షమాభిక్ష పత్రాలు రాసి పింఛన్లు పొందిన వారికి చట్టబద్ధత కల్పిస్తూ, స్వాతంత్ర్య సమర యోధుల సేవలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే,భాజపా కాంగ్రెస్ విమర్శలపై స్పందించింది.దిల్లీ భాజపా చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా, కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు.
వివరాలు
దిల్లీ అభివృద్ధికి ఇది కీలకమైన రోజు
కాంగ్రెస్ ఎప్పుడూ స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించలేదని ఆయన విమర్శించారు.
ఈ నేపథ్యంలో, యూనివర్సిటీకి వీర్ సావర్కర్ పేరు పెట్టడం వైఖరిని భాజపా స్వాగతించింది.
ప్రధాని మోదీ, దేశ రాజధానిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ, దిల్లీ అభివృద్ధికి ఇది కీలకమైన రోజు అని చెప్పారు.
విద్యా రంగంలో ప్రారంభించే మౌలిక సదుపాయాల ద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి వాతావరణం అందించనున్నట్టు తెలిపారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త అవకాశాలను పొందుతారని చెప్పారు.
దిల్లీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యకు పేరుగాంచిన నగరంగా ఎదుగుతూ, త్వరలో దేశ రాజధానిగా ఎడ్యుకేషనల్ హబ్‌గా గుర్తింపు పొందనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.