NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Namibian cheetah: కునో పార్క్ వద్ద నమీబియా చిరుత మృతి.. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుండి 10వ మరణం 
    తదుపరి వార్తా కథనం
    Namibian cheetah: కునో పార్క్ వద్ద నమీబియా చిరుత మృతి.. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుండి 10వ మరణం 
    Namibian cheetah: కునో పార్క్ వద్ద నమీబియా చిరుత మృతి

    Namibian cheetah: కునో పార్క్ వద్ద నమీబియా చిరుత మృతి.. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుండి 10వ మరణం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2024
    05:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2022 సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరణించింది.

    శౌర్య మరణంతో,భారతదేశంలో పుట్టిన ఏడు పెద్ద, మూడు పిల్ల చిరుతలు మార్చి 2023 నుండి మరణించాయి.

    చిరుతల తరలింపును పర్యవేక్షిస్తున్నప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో,మరణానికి గల కారణాలను పోస్ట్‌మార్టం తర్వాత మాత్రమే నిర్ధారించగలమని చెప్పారు.

    ఈ రోజు ఉదయం 11 గంటలకు చిరుత నడకలో అస్థిరతను ట్రాకింగ్ ద్వారా గమనించామని, చిరుత బలహీనంగా ఉందని,చిరుతను బతికించేందుకు సీపీఆర్ చేసినా ప్రతిస్పందిచలేదని ఆయన వెల్లడించారు.

    మొత్తం 20 జంతువులను నమీబియా,దక్షిణాఫ్రికా నుండి కునో నేషనల్ పార్క్‌కు రెండు బ్యాచ్‌లలో ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా కింద తీసుకువచ్చింది.

    Details

    7 దశాబ్ధాల క్రితం దేశంలో అంతరించిన చిరుతలు  

    మొదటి బ్యాచ్ సెప్టెంబర్ 2022, రెండవది ఫిబ్రవరి 2023. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోని అడవుల్లో చిరుతలను ప్రవేశపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.

    దాదాపుగా 7 దశాబ్ధాల క్రితం దేశంలో చిరుతలు అంతరించిపోయాయి. వీటిని మళ్లీ పెంచాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ చీతాను చేపట్టారు.

    ఆగస్ట్ 2023లో, కునో నేషనల్ పార్క్‌లో ఆడ చిరుత 'ధాత్రి' చనిపోయింది. నాలుగు నెలల క్రితం, మార్చిలో, సాషా అనే నమీబియా చిరుత కిడ్నీ సమస్యల కారణంగా మరణించింది.

    మరో చిరుత, ఉదయ్ ఏప్రిల్ 13న మరణించింది.

    ఒక నెల తర్వాత, దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చిన దక్ష అనే ఆడ చిరుత, సంభోగం సమయంలో రెండు మగ చిరుతలతో "హింసాత్మక పరస్పర చర్య" తర్వాత చనిపోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కునో నేషనల్ పార్క్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    కునో నేషనల్ పార్క్

    కునో నేషనల్ పార్కులో 4 చీతాల కుమ్ములాట.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అగ్ని  మధ్యప్రదేశ్
    కునో నేషనల్ పార్కులో నేలరాలిన సూరజ్.. 4 నెలల్లో ఎనిమిది చీతాల మరణాలు  మధ్యప్రదేశ్
    KUNO NATIONAL PARK : చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆరా.. కేంద్రంపై ప్రశ్నల వర్షం సుప్రీంకోర్టు
    కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి.. ఆందోళన రేకెత్తిస్తున్న చీతాల వరుస మరణాలు మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025