Page Loader
Hyderabad: క్రికెట్ బంతి తీసేందుకు పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు.. కనిపించిన దృశ్యం చూసి షాక్
క్రికెట్ బంతి తీసేందుకు పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు.. కనిపించిన దృశ్యం చూసి షాక్

Hyderabad: క్రికెట్ బంతి తీసేందుకు పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు.. కనిపించిన దృశ్యం చూసి షాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో గత ఏడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఒక ఇంటిలో మానవ అస్తిపంజరం బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. అందిన సమాచారం ప్రకారం,ఆ ఇంటిలో గత ఏడు సంవత్సరాలుగా ఎవరూ నివసించకపోవడంతో పూర్తిగా నిరుపయోగంగా ఉంది. ఆఇంటి యజమాని విదేశాల్లో ఉన్నారని స్థానికులు తెలిపారు.ఇటీవల కొందరు బాలురు ఆ ఇంటి సమీపంలో క్రికెట్ ఆడుతుండగా,బంతి ఆ ఇంట్లో పడింది. దాన్నితీసుకురావాలని ప్రయత్నించిన వారు ఇంటి తలుపు తీయగానే,అక్కడ మానవ అస్తిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా భయానికి గురయ్యారు. వారిలో ఒక బాలుడు ఆదృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది పోలీసుల దృష్టికి వెళ్లింది.

వివరాలు 

 గత ఏడేళ్లుగా కుటుంబానికి దూరంగా.. 

వెంటనే స్పందించిన హబీబ్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇంటిని సీజ్ చేసి దర్యాప్తును ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, ఆ మృతదేహం స్థానికంగా ఉన్న అమీర్ ఖాన్ అనే వ్యక్తిదే అయ్యుండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహం, ఆస్తి వివాదాల నేపథ్యంలో అమీర్ ఖాన్ తన సోదరులతో విభేదాలు ఏర్పడటంతో గత ఏడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్నాడని సమాచారం. కరోనా మహమ్మారి సమయంలో ఆయన కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, ఆయన గల్లంతైనట్లు ఎలాంటి అధికారిక మిస్సింగ్ ఫిర్యాదు పోలీసులకు అందలేదు. ఈ సంఘటన స్థలాన్ని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ స్వయంగా పరిశీలించారు.

వివరాలు 

కుటుంబ సభ్యులను ప్రశ్నించడం ద్వారా ఈ కేసులో కీలకమైన వివరాలు  బయటపడే అవకాశం 

మృతదేహం ఎవరికి చెందినదీ గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందంతో కలిసి డీఎన్ఏ పరీక్షలు పరీక్షలు చేపట్టనున్నారు. రక్త సంబంధీకుల నుంచి నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేపట్టనున్నారు. పెళ్లి, ఆస్తి విషయంలో జరిగిన గొడవల కారణంగా అమీర్ ఖాన్‌ను ఎవరో హత్య చేసి మృతదేహాన్ని తాళం వేసి పెట్టారా..? లేదా అతడే ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులను నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారిని ప్రశ్నించడం ద్వారా ఈ కేసులో కీలకమైన వివరాలు బయటపడే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. మునీర్ కుటుంబ సభ్యులంతా విచారణకు హాజరైతే మాత్రమే ఈ కేసులోని మిస్టరీ బయటపడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అస్థిపంజరం వీడియో ఇదే..