Nara Bhuvaneshwari : బస్సు యాత్రకు సిద్ధమైన నారా భువనేశ్వరి.. నిజం గెలవాలి పేరిట బాధిత కుటుంబాల పరామర్శ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర ప్రారంభించనుంది. అక్టోబర్ 25న బుధవారం నుంచి ఈ బస్సు యాత్ర మొదలుకానుంది.అయితే చంద్రబాబు తొలి నియోజకవర్గం చంద్రగిరి నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. బస్సుపై ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వరి ఫొటోలతో కూడిన థీమ్‌ను సిద్ధం చేశారు. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని భూవనేశ్వరి దర్శించుకున్నారు. చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. 'నిజం గెలవాలి' యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. అనంతరం స్థానిక సభలు, సమావేశాలకూ హాజరవనున్నారు.