
Nara Devansh : లండన్‌లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న నారా దేవాన్ష్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ లండన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుకకు మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మిణిలు ప్రత్యక్షంగా హాజరయ్యారు. గతేడాది డిసెంబర్‌లో నారా దేవాన్ష్ చెస్ రంగంలో ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను అతి తక్కువ సమయంలో పరిష్కరించి 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్' టైటిల్‌ను దక్కించుకున్నాడు.
Details
నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డు అందజేత
దీనితోపాటు ఆయన సాధించిన మరో రెండు విశేష రికార్డులను కూడా ప్రతిష్టాత్మక 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ - లండన్' అధికారికంగా గుర్తించింది. తన ప్రత్యేకమైన వ్యూహాత్మక ఆటతీరుతో కేవలం 11 నిమిషాల 59 సెకన్లలోనే అన్ని చెక్‌మేట్ పజిల్స్ పూర్తి చేసిన దేవాన్ష్.. ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఘనత సాధించాడు. ఈ విజయానికి గుర్తింపుగా తాజాగా లండన్‌లో జరిగిన అవార్డు కార్యక్రమంలో 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' నిర్వాహకుల చేతుల మీదుగా దేవాన్ష్ అవార్డు స్వీకరించాడు.