LOADING...
Nara Lokesh: ఈ రోజు పన్నెండు గంటలకు లోకేశ్ భారీ ప్రకటన.. ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్
ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్

Nara Lokesh: ఈ రోజు పన్నెండు గంటలకు లోకేశ్ భారీ ప్రకటన.. ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక పెద్ద ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ విషయాన్ని రివీల్ చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించినట్టు లోకేశ్ పేర్కొన్నారు. ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డు బలమైన, విశ్వసనీయమైన జ్యూరీ ద్వారా ఈ అవార్డు లభించందని అన్నారు. ఆ అవార్డు ఏంటి? దాని విజేత ఎవరు అన్న దానిపై ఈరోజు మధ్యాహ్నం తెలియజేస్తానని తెలిపారు. అయితే ఏ అవార్డు వచ్చింది? ఎవరికి వచ్చిందన్న దానిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఉత్కంఠను అధికారుల్లో రేపినట్లయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నారా లోకేష్ చేసిన ట్వీట్ 

Advertisement