LOADING...
TTD Parakamani Theft: వైసీపీ పాలనలో శ్రీవారి పరకామణి సొమ్ము దొంగతనం.. వీడియో రిలీజ్ చేసిన నారా లోకేశ్
వైసీపీ పాలనలో శ్రీవారి పరకామణి సొమ్ము దొంగతనం.. వీడియో రిలీజ్ చేసిన నారా లోకేశ్

TTD Parakamani Theft: వైసీపీ పాలనలో శ్రీవారి పరకామణి సొమ్ము దొంగతనం.. వీడియో రిలీజ్ చేసిన నారా లోకేశ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ పాలనలో టీటీడీ పరకామణి సొమ్ము దొంగతనంపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు శ్రీవారి సొత్తును దోచుకున్నారని, దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే బయటకొచ్చాయని లోకేశ్ తెలిపారు. వంద కోట్ల పరకామణి 'దొంగ' వెనుక భూమన కరుణాకరరెడ్డి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ వీడియోలు ఈ రోజు బయటకు వచ్చాయని, రేపు నిందితులే వైఎస్సార్సీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. లోకేశ్ విమర్శలతో వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి, అరాచకం పునరావృతమైందని, దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారని తెలిపారు.

Details

పరకామణి సొత్తును దోచేశారని అవేదన

గనులు, భూములు, అడవులు, వనరులు, మానవ వనరులను దోచి చివరికి తిరుమల శ్రీవారి సొత్తును కూడా వదలలేదని లోకేశ్ ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అండతో తిరుమల పరకామణి సొమ్మును కొల్లగొట్టారని, దొంగతనానికి సంబంధించిన సొమ్మును రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి, వాటాలను తిరుపతి భూమన నుండి తాడేపల్లి ప్యాలెస్ వరకు పంచుకున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. . అధికారం అండగా జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదని, ఏడు కొండలవాడు పవర్‌ఫుల్‌గా ఉండటంతో భూమన్ ఏకంగా పరకామణి సొత్తును దోచేశారని లోకేశ్ పేర్కొన్నారు. గుడినీ, గుడిలో హుండీని దోచుకోవడం జగన్ గ్యాంగ్ పాపమని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Details

 టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో వంద కోట్లకు పైగా సొమ్ము దోపిడీ 

అయితే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి కూడా వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్రమాలకు అడ్డుగా మార్చలేదని తీవ్రంగా విమర్శించారు. భూమన కరుణాకరరెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో వంద కోట్ల పైగా సొమ్ము దోపిడీకి గురైందని, రవికుమార్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినారని ఆయన చెప్పారు. పోలీసులు, టీటీడీ ఉన్నతాధికారులు లోక్‌అదాలత్‌ ద్వారా కేసును రాజీకి తీసుకువచ్చినట్లు, పరకామణి డబ్బుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం జరగిందని భానుప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక ఉన్నతాధికారి త్వరలో చేసిన తప్పులను ఒప్పుకోబోతున్నారని, పెద్ద పేర్లే బయటకు వస్తారని ఆయన తెలిపారు. వైసీపీ హయాంలో శ్రీవారి భక్తులు మరిచిపోయిన, పోగొట్టుకున్న సొమ్ములను పంచుకున్నారని తుడా మాజీ ఛైర్మన్ దివాకరరెడ్డి ఆక్షేపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నారా లోకేశ్ చేసిన ట్వీట్