Nara Lokesh: ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం నారా లోకేశ్ కసరత్తు
ఏపీ మంత్రి నారా లోకేశ్ తన అమెరికా పర్యటనలో భాగంగా లాస్‌వెగాస్‌లో నిర్వహించిన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో హజరయ్యారు. ఈ సమ్మిట్‌లో ఆయన పలు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి, రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్, సేల్స్‌ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియా తదితరులతో లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, పౌరసేవలలో సాంకేతికత వాడకం గురించి వారికి క్షుణ్ణంగా వివరించారు.
యువతకు అవసరమైన ఐటీ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ
ఇందులో భాగంగా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్‌ను రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఆహ్వానించారు. అలాగే, రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్‌తో చర్చల సందర్భంగా, రాష్ట్రంలో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్ స్థాపనలో భాగస్వామ్యం కోరారు. యువతకు అవసరమైన ఐటీ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించడానికి కోడింగ్ బూట్ క్యాంప్‌లు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలసి పని చేయాలని సూచించారు.