మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులు తప్పించుకోలేరని హెచ్చరిక
గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు మణిపూర్ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిశాక తన హృదయం ఆవేదనతో నిండిపోయిందని చెప్పారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. మహిళల రక్షణకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. ఘటన నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా స్పందించాలన్నా మోదీ నిందితులను శిక్షించేందుకు చట్టం పూర్తి శక్తితో పనిచేస్తుందన్నారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ్యులంతా సహకరించాలన్నారు.