Page Loader
Manipur: మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ
మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ

Manipur: మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం తీవ్ర అల్లర్లు, నిరసనలతో రగిలిపోతుంది. రెండు వేర్వేరు జాతుల మధ్య వైరస్పద పరిస్థితి ఇప్పటికే ఏడాదిన్నర నుంచి నెలకొని, శాంతి స్ధాపనకు ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మణిపూర్‌లో శాంతి సాధించలేకపోవడంతో, ఎన్‌పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) తమ మద్దతును ఉపసంహరించుకుంది. మణిపూర్ శాసనసభలో ఎన్పీపీకి 7 మంది ఎమ్మెల్యేలున్నా, బీజేపీకి సొంత మెజారిటీ ఉండటం వల్ల ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం లేదు. తాజాగా శనివారం రాత్రి మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.

వివరాలు 

ఐదు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ

జిరిబామ్ జిల్లాలో కుకీల తగిలిన ఆరుగురు మైటీ వర్గానికి చెందిన వారిని చంపిన సంఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతూ, నిరసనకారులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను లక్ష్యంగా దాడులు చేశారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇంటిపై కూడా దాడి జరిగింది. ఇలాంటి పరిస్థితిలో, అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి, నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను వాడారు. ఇప్పటికే అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపించారు. దీంతో, మణిపూర్ ప్రభుత్వం ఐదు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధిస్తూ, కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.