
PM Modi: ఆగస్టు 23న జాతీయ స్పేస్ డే.. మీ ఆలోచనలు పంపండి : నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (జూలై 28) 124వ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విజ్ఞానం, క్రీడలు, సాంస్కృతిక పురోగతి, శాస్త్రీయ అభివృద్ధిపై మాట్లాడారు. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ప్రగతిశీల ఘటనలను గుర్తు చేస్తూ ప్రతి భారతీయుడిలో గర్వభావనను నింపేలా మోదీ వివరించారు. మోదీ ప్రకారం, ఇటీవల శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి విజయవంతంగా తిరిగొచ్చినప్పుడు దేశమంతా ఆనందంలో మునిగిపోయిందన్నారు. చంద్రయాన్-3 విజయంతో దేశవ్యాప్తంగా శాస్త్రీయ చైతన్యం పెరిగిందని, పిల్లలు కూడా స్పేస్ సైన్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు.
Details
నేషనల్ స్పేస్ డే: ఆగస్టు 23
ప్రధాని మోదీ ఆగస్టు 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని (National Space Day) పురస్కరించుకుని ప్రజల నుంచి కొత్త ఆలోచనలు, సలహాలు, సూచనలు కోరారు. ఇందుకోసం 'నమో యాప్' ఉపయోగించాలని సూచించారు. అంతరిక్షం, శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇన్‌స్పైర్ మాన్‌క్ అభియాన్‌పై ప్రత్యేకంగా విద్యార్థుల ఆవిష్కరణలను ప్రోత్సహించే ఇన్‌స్పైర్ మాన్‌క్ అభియాన్ గురించి మోదీ ప్రస్తావించారు. ఈ పథకం కింద దేశంలోని ప్రతి పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు లక్షలాది మంది విద్యార్థులు ఇందులో భాగం కావడం గర్వకారణమన్నారు.
Details
స్టార్టప్ విప్లవం.. స్పేస్ రంగంలో భారీ పురోగతి
ఐదేళ్ల క్రితం దేశంలో 50కంటే తక్కువ స్పేస్ స్టార్టప్స్ మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 200 దాటిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్‌లో స్పేస్ రంగంలోకి వచ్చిన మార్పునకు నిదర్శనమని పేర్కొన్నారు.
Details
ఒలింపియాడ్ విజయాలతో దేశ గర్వం
ఇటీవలి ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థులు దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరీలు పతకాలు గెలిచారని చెప్పారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో భారత బృందం మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకంతో మెరిసిందన్నారు. వచ్చే నెల ముంబైలో జరిగే ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ ప్రపంచంలోని అతిపెద్ద ఒలింపియాడ్‌గా నిలవనుందని తెలిపారు. విద్యార్థులు, యువత అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని, భారత భవిష్యత్ ఎంతో ఆశాజనకంగా ఉందని ప్రధాని మోదీ ప్రసంగం ద్వారా సూచించారు.