
Mock Dril: దేశ వ్యాప్తంగా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో గల ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన పరిస్థితిలో.. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రజలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన దిశగా దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది.
'ఆపరేషన్ అభ్యాస్'పేరిట నిర్వహిస్తున్న ఈ మాక్ డ్రిల్ సాయంత్రం 4గంటలకు మొదలైంది.
దాదాపు 50సంవత్సరాల తర్వాత ఈ తరహా మాక్ డ్రిల్ దేశంలో చేపడుతున్నారు.
మొత్తం దేశ వ్యాప్తంగా 244 ప్రాంతాల్లో ఈ డ్రిల్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ మాక్ డ్రిల్లులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్, డీఆర్డీవో, మౌలాలీ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ కొనసాగుతోంది. విశాఖపట్నంలో రెండు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హైదరాబాద్ లో మాక్ డ్రిల్
ప్రారంభమైన మాక్ డ్రిల్స్
— Telangana First (@TelanganaFirst_) May 7, 2025
హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మోగిన సైరెన్
హైదరాబాద్ నగరంలో నాచారం, కంచన్ బగ్, గోల్కొండ మరియు సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్
హోంశాఖ సూచన మేరకు హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహణ. https://t.co/YJrkp9pZfl pic.twitter.com/HBsRPCSMnd