Loading...
India's cleanest city: ఎనిమిదేళ్ల ఇండోర్ ఆధిపత్యానికి బ్రేక్.. దేశంలోనే క్లీన్ సిటీగా నవీ ముంబై
ఎనిమిదేళ్ల ఇండోర్ ఆధిపత్యానికి బ్రేక్.. దేశంలోనే క్లీన్ సిటీగా నవీ ముంబై

India's cleanest city: ఎనిమిదేళ్ల ఇండోర్ ఆధిపత్యానికి బ్రేక్.. దేశంలోనే క్లీన్ సిటీగా నవీ ముంబై

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో మహారాష్ట్రకు చెందిన నవీ ముంబై అగ్రస్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 ర్యాంకింగ్స్‌లో ఈ నగరం మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మూడో స్థానంలో నిలవడం విశేషం. 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మొదటి స్థానాన్ని దక్కించుకుంది. చండీగఢ్ రెండో స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుంటూరు మూడో స్థానాన్ని సాధించింది. మరోవైపు గత ఎనిమిదేళ్లుగా దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందుతూ వచ్చిన ఇండోర్‌కు ఈసారి నిరాశ ఎదురైంది. తాజా జాబితాలో ఆ నగరానికి చోటు దక్కలేదు.

వివరాలు 

నదీ తీర ప్రాంత పరిశుభ్రమైన నగరాల విభాగంలో రేవా మొదటి స్థానం

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో భాగంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నగరాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు.

నదీ తీర ప్రాంతాల్లో ఉన్న పరిశుభ్రమైన నగరాల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని రేవా మొదటి స్థానంలో నిలిచింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మూడో స్థానంలో నిలిచింది.

10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో గ్రేటర్ విశాఖపట్నం అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది.

ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మూడో స్థానంలో నిలిచాయి.

వివరాలు 

మెంటర్ సిటీ విభాగంలో మూడో స్థానంలో తిరుపతి

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వచ్ఛ తీర ప్రాంత పట్టణాల విభాగంలో ఒడిశాలోని పూరీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

కేరళలోని అలప్పుజ రెండో స్థానంలో నిలవగా.. మహారాష్ట్రలోని రత్నగిరి మూడో స్థానాన్ని సాధించింది.

ఇక పరిశుభ్రమైన హిమాలయ నగరాల విభాగంలో రుద్రాపూర్ మొదటి స్థానంలో నిలిచింది. జమ్మూ రెండో స్థానాన్ని దక్కించుకుంది.

మెంటర్ సిటీ విభాగంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ అగ్రస్థానంలో నిలవగా.. ఇండోర్ రెండో స్థానాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి మూడో స్థానంలో నిలవడం విశేషం.

ADVERTISEMENT