Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ మృతి.. ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గంగ్లూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది,ఇందులో ఒక మావోయిస్టు హతమయ్యాడు. మావోయిస్టులు పేలుడు పదార్థాలను ఉపయోగించి మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. మావోయిస్టు డివిజన్ కమిటీ మెంబర్ దినేష్ మొదియమ్,కమాండర్ వెల్లాతోపాటు 30-40 మంది అక్కడ సమావేశమయ్యారన్నసమాచారం మేరకు భద్రతా సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. కాల్పుల తర్వాత సిబ్బంది పరిశీలనలో ఒక మావోయిస్టు మృతదేహం,9ఎంఎం పిస్టల్,ఒక మందుపాతర,ఆరు రిమోట్ స్విచ్‌లు,ఇతర మావోయిస్టు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.