Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం: అజిత్ పవార్ వారసురాలిగా సునేత్రా పవార్?
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్సీపీ (అజిత్ వర్గం) సన్నాహాలు ప్రారంభించింది. పార్టీ సీనియర్ నేతల సూచన ప్రకారం, అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా ఆయన భార్య, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సునేత్రా పవార్‌ను రంగంలోకి దించాలని పార్టీ సీనియర్ నేతలు నిర్ణయించినట్లు సమాచారం.. ఆమెను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకొని,ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలనే యోచనలో ఉన్నారు. గురువారం బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యే వెంటనే పార్టీ భవిష్యత్తుపై కీలక సమావేశం జరిగింది. ప్రఫుల్ పటేల్,ఛగన్ భుజబల్,సునీల్ తట్కరే తదితర సీనియర్ నేతలు సునేత్రా పవార్‌తో చర్చించారని తెలుస్తోంది.
వివరాలు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరొక ఆసక్తికర పరిణామం
"ప్రజలు 'వాహిని' (సునేత్రా పవార్)నాకాయత్వాన్ని కోరుకుంటున్నారు. అజిత్ దాదా ఆశయాలను ఆమె మాత్రమే కొనసాగించగలరు"అని అని మంత్రి నరహరి జిర్వాల్ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే తీరును నిర్ణయించేందుకు ఎన్సీపీ నేతలు త్వరలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ను కలవనున్నారు. అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో మరొక ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. శరద్ పవార్ వర్గం (బాబాయ్),అజిత్ పవార్ వర్గం (అబ్బాయ్)మళ్లీ కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు కలిసి పనిచేశారు. "కుటుంబం,పార్టీ మళ్లీ ఒకటై ఉండాలన్నదే అజిత్ దాదా చివరి కోరిక. ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నాం"అని పవార్ కుటుంబ సన్నిహితులు వెల్లడించారు.
వివరాలు
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి
బుధవారం బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా పేరుగాంచిన ఆయన మరణం మహాయుతి (బీజేపీ-శివసేన-ఎన్సీపీ) కూటమికి పెద్ద దెబ్బ. ఇప్పుడు ఆ ఖాళీని సునేత్రా పవార్ ద్వారా భర్తీ చేసి, ప్రజల సానుభూతిని ఆకర్షిస్తూ పార్టీ స్థిరత్వాన్ని కొనసాగించాలనే సంకల్పంలో ఎన్సీపీ ఉంది.