Loading...
Andhra Pradesh Weather: ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు 
ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Andhra Pradesh Weather: ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,ఉరుములు,మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని అమరావతి వాతావరణకేంద్రం తాజా బులెటిన్‌లో పేర్కొంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం,ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక,పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న మరో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,యానాం ప్రాంతాల దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి,పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

వివరాలు 

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ - యానాం

బుధవారం, గురువారం: కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

శుక్రవారం: ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా మెరుపులు సంభవించవచ్చు. ఈదురుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

వివరాలు 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

బుధవారం: కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మెరుపులతో కూడిన ఉరుములు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచవచ్చని అధికారులు పేర్కొన్నారు.

గురువారం, శుక్రవారం: ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించడంతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

రాయలసీమ

రాయలసీమలో బుధవారం నుంచి శుక్రవారం వరకు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ ప్రాంతంలో కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ప్రజలు ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, అవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ADVERTISEMENT