NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
    ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

    PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 21, 2025
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను వెల్లడించింది.

    2022 నుంచి 2024 డిసెంబర్‌ వరకు ప్రధాని మోదీ మొత్తం 38 విదేశీ పర్యటనలు చేసినట్లు ప్రకటించింది.ఈ పర్యటనలపై రూ.258 కోట్లు ఖర్చయినట్లు వివరించింది.

    రాజ్యసభలో ప్రశ్న - కేంద్ర ప్రభుత్వ సమాధానం

    విపక్ష నేత మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో గత మూడేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖర్చు ఎంతయ్యింది? అని ప్రశ్నించారు.

    దీనికి స్పందిస్తూ,విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా(Pabitra Margherita) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

    2022 మే నుంచి 2024 డిసెంబర్‌ వరకు ప్రధాని 38 దేశాల సందర్శన చేసినట్లు స్పష్టంగా తెలియజేశారు.

    వివరాలు 

    ప్రధాని పర్యటించిన దేశాలు (2022-24) 

    ఈ కాలంలో ప్రధాని మోదీ అమెరికా, జపాన్, జర్మనీ, కువైట్, డెన్మార్క్, ఫ్రాన్స్, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, గ్రీస్, పోలాండ్, ఉక్రెయిన్, రష్యా, ఇటలీ, బ్రెజిల్, గయానా వంటి దేశాలను పర్యటించారు.

    2022 మేలో ప్రధాని తన విదేశీ పర్యటనను జర్మనీలో ప్రారంభించారు.

    2024 డిసెంబర్‌లో ఆయన చివరి పర్యటన కువైట్‌లో ముగిసింది.

    2023 జూన్‌లో అమెరికా పర్యటనకు రూ.22 కోట్లు ఖర్చైనట్లు కేంద్రం వెల్లడించింది.

    2023 సెప్టెంబరులో అమెరికా పర్యటనకు రూ.15.33 కోట్లు ఖర్చు అయ్యాయి.

    2022 మేలో నేపాల్ పర్యటనకు రూ.80 లక్షలు ఖర్చయ్యాయి.

    2023 మేలో జపాన్ పర్యటనకు రూ.17.19 కోట్లు వ్యయం అయినట్లు వివరించారు.

    2014కు ముందు ప్రధానుల విదేశీ పర్యటనల ఖర్చు

    వివరాలు 

    ప్రధాని అమెరికా పర్యటనకు రూ.10.74 కోట్లు

    కేంద్ర మంత్రి 2014కు ముందు ప్రధానుల చేసిన విదేశీ పర్యటనలకు సంబంధించి ఖర్చు వివరాలను కూడా వెల్లడించారు.

    2011లో అప్పటి ప్రధాని అమెరికా పర్యటనకు రూ.10.74 కోట్లు ఖర్చు అయ్యాయి.

    అదే ఏడాది ఫ్రాన్స్ పర్యటనకు రూ.8.33 కోట్లు ఖర్చైనట్లు తెలిపారు. 2013లో రష్యా పర్యటనకు రూ.9.95 కోట్లు, జర్మనీ పర్యటనకు రూ.6 కోట్లు ఖర్చయినట్లు వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా
    Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు తెలంగాణ

    కేంద్ర ప్రభుత్వం

    No Detention: 'నో డిటెన్షన్' విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి.. ఏ రాష్ట్రాల పిల్లలు ప్రభావితం అవుతారో తెలుసా? భారతదేశం
    Andra Pradesh: ఏపీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల నిధులు ఆంధ్రప్రదేశ్
    Tax Relief: 10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు.. గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం  బిజినెస్
    Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం మన్మోహన్ సింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025