West Bengal: బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28.5కోట్ల నోట్ల కట్టలు, 15 కిలోల బంగారం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో ఇసుక, క్వారీ మాఫియాపై కొనసాగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీర్‌భూమ్ జిల్లాలోని మాజీ బస్సు డ్రైవర్ మీనా మండల్ నివాసంపై పోలీసులు నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ నగదు,బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.28.5 కోట్ల నగదుతో పాటు 15కిలోల బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం,ఇసుక మాఫియాపై జరుగుతున్న విచారణలో భాగంగా అందిన విశ్వసనీయ సమాచారంతో మీనా మండల్ ఇంటిపై దాడులు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఇంట్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడటంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం,స్థానికంగా ఇసుక,క్వారీ మాఫియా డాన్‌గా పేరుగాంచిన తులు మండల్‌కు మీనా మండల్ సమీప బంధువుగా గుర్తించారు.
వివరాలు
గత ప్రభుత్వంలో బస్సు డ్రైవర్‌గా మీనా మండల్
మీనా మండల్ గతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో బస్సు డ్రైవర్‌గా పనిచేశాడు.
అనంతరం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి క్వారీ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
నగదు, బంగారంతో పాటు మీనా మండల్ పేరుపై భారీ స్థాయిలో ఆస్తులు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది.
ఈ ఆస్తులు, నగదు, బంగారం ఎలా సమకూరాయన్న దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమ ఆదాయ మార్గాలు, మాఫియా కార్యకలాపాలతో ఉన్న సంబంధాలపై కూడా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
వివరాలు
ఆపరేషన్ విజయవంతం కావడంపై పోలీసులను అభినందించిన ముఖ్యమంత్రి
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై బెంగాల్ ప్రభుత్వం స్పందించింది.
ముఖ్యమంత్రి సువేందు అధికారి ఎక్స్ వేదికగా పోలీసులను అభినందిస్తూ, విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ఈ దాడులు ఫలితాన్నిచ్చాయని పేర్కొన్నారు.
ప్రజల సొమ్మును దోచుకునే వారిపై ఎలాంటి రాజీ ఉండదని, అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, బీర్‌భూమ్ జిల్లాలో దాదాపు 250 క్వారీలు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఈ క్వారీలన్నీ తులు మండల్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు, అక్రమ ఆస్తుల మూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సువేందు అధికారి చేసిన ట్వీట్
Commendable job by our Law Enforcement personnel for the crackdown on Sand Mafia.
— Suvendu Adhikari (@SuvenduWB) July 29, 2026
Following a precise operation based on source based information, Birbhum Police conducted a major raid under Mohammad Bazar PS targeting the hideout of illegal sand mafia Tullu Mondal alias Mohd… pic.twitter.com/Ln4XJCWKKY