Rajasthan: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 19వ ఘటన
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. నీట్ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి చనిపోవడం అత్యంత బాధాకరం. ఈ ఏడాది ఇదే 19వ విద్యార్థి మరణం కావడం గమనార్హం. పోలీసుల సమాచారం ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన అశుతోష్ చౌరాసియా (20) గత వారం రోజుల్లో కోటాకు చేరి, నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. బుధవారం రాత్రి, కుటుంబ సభ్యులు అతన్ని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఎలాంటి స్పందన లేదు. దీనితో పేయింగ్ గెస్ట్ నిర్వాహకుడికి ఈ విషయం తెలపగా,అతను గదికి వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తెరవకపోవడంతో,పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి,గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించిన అతడిని గుర్తించారు.ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఆందోళన
పోస్టుమార్టం, ఇతర ఫోరెన్సిక్ పరీక్షలు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. కోటాలో వివిధ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్ల కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని విమర్శలు వస్తున్నాయి. 2024లో ఇప్పటి వరకు 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటంతో ఇది మరింత ఆందోళనకు గురిచేస్తోంది. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి ప్రభావం అద్భుతంగా కనబడటం లేదు.