Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో సంచలన పరిణామం.. 47 మంది ఎన్‌టీఏ అధికారులపై కేంద్రం వేటు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జేఈఈ,నీట్‌తో పాటు పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. పరీక్షా పత్రాల లీకేజీల కారణంగా ఎన్‌టీఏ పదేపదే వివాదాల్లో చిక్కుకోవడంతో,ఈ వ్యవహారాలకు బాధ్యులుగా గుర్తించిన 47మంది అధికారులను సేవల నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
ఔట్‌సోర్సింగ్ విధానంలో కీలక మార్పులు
వీరిలో పలువురిపై చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు వెల్లడించింది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఎన్‌టీఏలో చేపట్టిన ఈ చర్యలు ప్రక్షాళన ప్రక్రియలో తొలి దశగా భావిస్తున్నారు.
ఇకపై పరీక్షల నిర్వహణలో ఎలాంటి లీకేజీలకు అవకాశం లేకుండా నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు ఔట్‌సోర్సింగ్ విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎన్‌టీఏలో ప్రక్షాళన.. 47 మంది అధికారుల తొలగింపు
Sources- "National Testing Agency has terminated 47 officials from their service. Legal and criminal actions will also be taken against some of these officials. This is part of a complete overhaul of NTA that has been in controversy over paper leaks." pic.twitter.com/zz2mcGIqQp
— ANI (@ANI) July 24, 2026