Page Loader
NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన 
నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన

NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2025) వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షను రెండుసార్లు నిర్వహించే విధానాన్ని రద్దుచేసి, సింగిల్ షిఫ్ట్‌లో నిర్వహించాలనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు NBEMS వెల్లడించింది. ఒక్కే షిఫ్ట్‌లో పరీక్షను నిర్వహించేందుకు మరిన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాయిదా నేపథ్యంలో NEET PG 2025కి సంబంధించిన కొత్త తేదీలను త్వరలో NBEMS వెల్లడించనుంది. ఇంతకుముందు జూన్ 15, 2025న నిర్వహించాల్సిన NEET PG పరీక్షను జూన్ 2న NBEMS వాయిదా వేసింది.

Details

అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల వాయిదా

షెడ్యూల్ ప్రకారం అదే రోజున అంటే జూన్ 2న అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల కావాల్సి ఉండగా, పరీక్ష వాయిదా పడిన నేపథ్యంలో ఈ ప్రక్రియను కూడా నిలిపివేశారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలతో పాటు, సిటీ స్లిప్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీలను NBEMS ప్రకటించనుంది. అప్పటివరకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలి. NEET PG 2025 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులైన MD, MS, PG డిప్లొమాల్లో ప్రవేశానికి అవకాశం కలుగుతుంది.

Details

త్వరలోనే మరిన్ని వివరాలు

ఈ ప్రవేశ పరీక్షను NBEMS నిర్వహిస్తుండగా, పరీక్ష అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో 50 శాతం 'ఆల్ ఇండియా కోటా' (AIQ) సీట్ల కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నిర్వహణ చేపడుతుంది. మిగతా సీట్లను సంబంధిత రాష్ట్ర కౌన్సెలింగ్ సంస్థలు నిర్వహిస్తాయి. వాయిదా కారణంగా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని వివరాలను సమగ్రంగా త్వరలో ప్రకటిస్తామని NBEMS స్పష్టం చేసింది.