Loading...
Nepal PM: భారత్‌లో నేపాల్ ప్రధాని బాలేంద్ర షా.. రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం
భారత్‌లో నేపాల్ ప్రధాని బాలేంద్ర షా.. రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం

Nepal PM: భారత్‌లో నేపాల్ ప్రధాని బాలేంద్ర షా.. రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ ప్రధాని బలేంద్ర షా రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ఈ ఏడాది మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత్, నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఇంధనం, జలవిద్యుత్, రైల్వే అనుసంధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

వివరాలు 

రాష్ట్రపతి ముర్ముతోనూ భేటీ కానున్న బాలేంద్ర షా

ఈ పర్యటనలో భాగంగా అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పుర్ ధామ్ వరకు నడిచే కొత్త వారాంతపు రైలు సర్వీసును ఇరు దేశాల ప్రధానులు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

న్యూఢిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సుమారు 604 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు జనక్‌పుర్ ధామ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కంటోన్మెంట్‌తో అనుసంధానించనుంది.

బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన పట్టణాలు, నగరాల మీదుగా ఈ రైలు నడవనుంది.

పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోనూ నేపాల్ ప్రధాని భేటీ కానున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ-షా భేటీ

ADVERTISEMENT

వివరాలు 

పలు రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం

బాలేంద్ర షా పర్యటన సందర్భంగా భారత్, నేపాల్ మధ్య వివిధ రంగాలకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరే అవకాశం ఉంది.

ఈ పర్యటన భారత్ అనుసరిస్తున్న 'నైబర్‌హుడ్ ఫస్ట్' (పొరుగు దేశాలకు ప్రాధాన్యం) విధానంలో భాగమని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇరు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశమని తెలిపింది.

భారత్, నేపాల్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికతపరమైన సంబంధాలతో పాటు ప్రజల మధ్య బలమైన అనుబంధం కూడా ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

34 మంది సభ్యులతో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తున్న షా

నేపాల్ ప్రధాని బాలేంద్ర షా 34మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందంతో భారత్‌లో పర్యటిస్తున్నారు.

ఇందులో కీలక సలహాదారులు, మంత్రులు ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా నేపాల్-భారత్ బిజినెస్ ఫోరం కూడా నిర్వహించనున్నారు.

నేపాల్‌లో భారత పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు ఇరు దేశాల వ్యాపారవేత్తలు కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలను ఈ వేదిక ద్వారా పరిశీలించనున్నారు.

వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి అవసరాల కోసం నేపాల్ 2 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయం కోరుతున్నట్లు సమాచారం.

ఇందులో 1 బిలియన్ డాలర్ల రాయితీ రుణం, 500 మిలియన్ డాలర్ల గ్రాంట్, వరదల తర్వాత పునర్నిర్మాణ పనుల కోసం మరో 500 మిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT