AP Tourism: బోట్ల రాకతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కొత్త ఊపిరి
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ పున్నమిఘాట్ వేదికగా జరుగుతున్న 'ఆవకాయ్-అమరావతి' ఉత్సవాల్లో భాగంగా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న పర్యాటకశాఖ బోట్ల నమూనాలను ప్రజలకు ప్రదర్శనగా ఉంచారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో త్వరలో ఏర్పాటు చేయనున్న ఈ పర్యాటక బోట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం రంగం కొత్త దిశలో ముందుకు సాగనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా పలు ప్రాంతాలకు ప్రతిపాదించిన హౌస్‌బోట్లతో పాటు ప్రత్యేక డిన్నర్ క్రూజ్ వెసల్ నమూనాలను చూపించారు.
Details
ప్రదర్శనలో ఉన్న బోట్ల నమూనాలు ఇవి
దిండి ప్రాంతానికి ప్రతిపాదించిన సింగిల్ బెడ్‌రూం హౌస్‌బోట్ రాజమహేంద్రవరం కోసం రూపొందించిన సింగిల్ బెడ్‌రూం హౌస్‌బోట్ సూర్యలంకలో ఏర్పాటు చేయనున్న లగ్జరీ హౌస్‌బోట్ స్వర్ణాలచెరువు ప్రాంతానికి సంబంధించిన సింగిల్ బెడ్‌రూం హౌస్‌బోట్ భవానీ ఐలాండ్ కోసం రూపొందించిన డిన్నర్ క్రూజ్ వెసల్ గండికోటలో పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించిన సింగిల్ బెడ్‌రూం హౌస్‌బోట్ త్వరలోనే ఈ పర్యాటక బోట్లను వాస్తవంగా ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రంలోని నదులు, జలాశయాలు, పర్యాటక ప్రాంతాలకు మరింత ఆకర్షణ పెరుగుతుందని, పర్యాటక ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పర్యాటక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.