PM Modi: ప్రతి రంగంలో కొత్త నాయకత్వం అవసరం : సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ 21వ శతాబ్దంలో జన్మించిన తరం 'అమృత తరం'గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. దిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌ను భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ నాయకులను తయారు చేయడానికి ఈ కాన్‌క్లేవ్ గొప్ప వేదిక అని అన్నారు. ప్రముఖ రంగాల్లోనూ, రాజకీయాల్లోనూ కొత్త నాయకులు ఎంతో అవసరమని మోదీ అన్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటం నుంచి కొత్త నాయకత్వం కోసం ప్రేరణ పొందాలని సూచించారు.
Details
కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి
ఈ ప్రేరణ ద్వారా అన్ని రంగాల్లో నూతన నేతలను ఎదిగించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు.
విక్షిత్ భారత్ సాధనలో కొత్త ఆలోచనలు, ఉత్సాహం, సమగ్ర ప్రణాళికలు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రపంచ ఆలోచనలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే విక్షిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని మోడీ పేర్కొన్నారు.