Page Loader
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 27, 2024
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ రైల్వే స్టేషన్ నిత్యమూ రద్దీగా ఉంటుంది. లోకల్ ట్రైన్స్ ఎక్కేందుకు వచ్చే హైదరాబాదీలతో ఈ ప్రాంతం మరింత రద్దీగా ఉంటుంది. అయితే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఒక కొత్త రూపం దాల్చనుంది. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించింది. మరో ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తియ్యే అవకాశం ఉంది.

Details

ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు

స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలను చేపట్టారు. ఆధునీకరణ పూర్తయిన తర్వాత, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా నియంత్రణ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇకపై ప్రయాణికులు రైలు ప్లాట్‌ఫామ్‌పైకి ముందుగా వచ్చే అవకాశం లేదు. ప్రయాణికులు వెయిటింగ్ హాల్‌లో ఉండి, రైలు రాక 15 నిమిషాల ముందు మాత్రమే ప్లాట్‌ఫామ్‌ మీదకు రావాల్సి ఉంటుంది. లగేజీ స్క్రీనింగ్ కోసం రూ. 6 కోట్ల వ్యయంతో రెండు భారీ లగేజీ స్క్రీనింగ్ మిషిన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టులో ఇదే విధానం అమల్లో ఉంది.

Details

కొత్త సేవల కోసం ప్రయాణికులు వెయిటింగ్

ప్రయాణికులు తమ లగేజీని ఈ స్క్రీనింగ్‌లో చెక్ చేయించి, రైలు బయలుదేరే ముందే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తవుతుండటంతో, ప్రయాణికులు కొత్త సేవల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.