
IRCTC: జులై 1 నుంచి కొత్త నిబంధన.. తత్కాల్ టికెట్ బుకింగ్‌కి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి!
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే ప్రయాణికులకు సంబంధించి ఓ కీలక మార్పు జరగబోతోంది. తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఇండియన్ రైల్వే శాఖ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత భద్రతను అందించడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జులై 1, 2025 నుంచి తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ వెరిఫైడ్ యూజర్ కావాల్సిందే. అంటే, IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారు తమ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించి వేరిఫై చేయాలి. ఇప్పటివరకు సాధారణంగా IRCTC లోగిన్ ఉన్న ఏ ప్రయాణికుడైనా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది.
Details
మరింత పారదర్శకంగా బుకింగ్ వ్యవస్థ
కానీ రాబోయే నెల నుంచి ఈ సౌలభ్యం అధికారికంగా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసిన యూజర్లకే పరిమితం చేయనున్నారు. ఈ కొత్త నిబంధనతో టికెట్ మాఫియాలకు చెక్ వేయడమే కాకుండా, బుకింగ్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని రైల్వే శాఖ ఆశిస్తోంది. అలాగే టికెట్ బ్లాక్ చేసి అధిక ధరకు ఇతరులకు విక్రయించే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల, తత్కాల్ బుకింగ్ చేసే ప్రయాణికులు జులై 1కి ముందు తమ IRCTC ఖాతాను ఆధార్‌తో లింక్ చేసి, వేరిఫై చేసుకోవాలి. లేకపోతే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం సాధ్యపడదు. ఈ మార్పు మీ భవిష్యత్తు ప్రయాణాలపై ప్రభావం చూపకుండాలంటే ఇప్పుడే ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోండి.