Page Loader
AP Liquor Scam: లిక్కర్ స్కాంలో నూతన మలుపు.. ఛార్జ్‌షీట్‌లో 48 మంది నిందితులు, జగన్ పేరు ప్రస్తావన
లిక్కర్ స్కాంలో నూతన మలుపు.. ఛార్జ్‌షీట్‌లో 48 మంది నిందితులు, జగన్ పేరు ప్రస్తావన

AP Liquor Scam: లిక్కర్ స్కాంలో నూతన మలుపు.. ఛార్జ్‌షీట్‌లో 48 మంది నిందితులు, జగన్ పేరు ప్రస్తావన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం సాయంత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. ఆయనను ఈ రోజు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. మిథున్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో అభ్యర్థన కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈకేసులో సిట్ దాఖలు చేసిన తాజా ఛార్జ్‌షీట్‌ మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. మొత్తం 305 పేజీలతో కూడిన ఈ ఛార్జ్‌షీట్‌లో మొత్తం 48మందిని నిందితులుగా పేర్కొంది.వీరిలో తాజాగా మరో 8 మందిని కొత్తగా చేర్చారు. అలాగే 16 మంది పాత్రపై స్పష్టమైన అభియోగాలు ఉన్నాయని సిట్ అధికారులు పేర్కొన్నారు.

Details

కొత్తగా నిందితులుగా చేర్చిన ఎనిమిది మంది వివరాలు ఇలా ఉన్నాయి

అనిరుధ్ రెడ్డి బొల్లారం శివకుమార్ సైమన్ ప్రసన్ రాజీవ్ ప్రతాప్ కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి మోహన్ కుమార్ అనిల్ కుమార్ రెడ్డి సుజల్ బెహ్రూన్

Details

ఈ కేసు మరింత వేడెక్కే అవకాశం

ఈ కేసులో సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా లిక్కర్ పాలసీ రూపొందించడంలో, ఆ పాలసీ అమలులో తీసుకున్న నిర్ణయాల్లో జగన్‌కు సమాచారం ఉన్నట్లు సిట్ పేర్కొంది. అయితే ఆయనను నిందితుడిగా ప్రస్తుతానికి చేర్చలేదు. జగన్ పాత్రపై పూర్తిస్థాయి విచారణ అనంతరం తుదినిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఛార్జ్‌షీట్‌లో మరో ఎనిమిది మందిని చేర్చడం, జగన్ పేరును ప్రస్తావించడం.. అన్నీ కలిసొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.