Telangana: నగర్ వన్ యోజన కింద 6 కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
పట్టణాల్లో పచ్చదనాన్ని విస్తరించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్ వన్ యోజన పథకం కింద రాష్ట్రానికి తాజాగా ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ ఆరు ప్రాజెక్టుల కోసం మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.8.26 కోట్ల నిధులను విడుదల చేసినట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డాక్టర్ సి.సువర్ణ వెల్లడించారు.
వివరాలు
అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా నిధుల వినియోగం
ఈ నిధులను అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. నగర్ వన్ యోజన కింద ఏర్పాటు చేసే అర్బన్ ఫారెస్ట్‌లలో ప్రాంతీయంగా సహజంగా పెరిగే మొక్కలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లను ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్‌గూడ, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, అలాగే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యెల్లంపేట, చెంగిచెర్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.