
Pilot Project: ఏపీలో రిజిస్ట్రేషన్‌కు కొత్త దారులు.. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రార్ శాఖ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి కేవలం 10 నిమిషాల్లోనే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తవడం, దానిని కొనుగోలు దారుడికి అందజేయడం లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కొత్త విధానం సోమవారం విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభమైంది. అధికారులు ప్రాజెక్ట్ ప్రారంభించిన అనంతరం మొదటి గంటలోనే మూడు డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసి, ముగ్గురు కస్టమర్లకు అప్పగించారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవడంతో ప్రజలు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం రోజులు తరబడి తిరగాల్సి వచ్చేది.
Details
రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం
కానీ ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా కేవలం పది నిమిషాల్లోనే ఆ ప్రక్రియ పూర్తవుతోంది. పటమట కార్యాలయంలో ఈ విధానం పట్ల ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. డాక్యుమెంట్ల స్కాన్ కాపీలను కస్టమర్లకు వాట్సాప్ ద్వారా కూడా అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. ఏపీ మొత్తం మీద ఈ విధానాన్ని త్వరలో అమలు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.