Page Loader
NewsClick case: న్యూస్‌క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్‌కు 7 రోజుల పోలీసు రిమాండ్ 
న్యూస్‌క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్‌కు 7 రోజుల పోలీసు రిమాండ్

NewsClick case: న్యూస్‌క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్‌కు 7 రోజుల పోలీసు రిమాండ్ 

వ్రాసిన వారు Stalin
Oct 04, 2023
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎడిటర్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్‌ను చైనీస్ ఫండింగ్‌కు సంబంధించిన కేసులో మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద అరెస్టైన వీరిని బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి వీరిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. డబ్బులు తీసుకొని చైనాకు అనుకూలమైన వార్తలను పబ్లిష్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం న్యూస్‌క్లిక్ కార్యాలయం, న్యూస్ పోర్టల్‌లో పని చేస్తున్న దాదాపు 40మంది జర్నలిస్టుల నివాసాల్లో దిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం చీఎఫ్ ఎడిటర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. అనంతరం దిల్లీలోని న్యూస్‌క్లిక్ కార్యాలయానికి పోలీసులు సీల్ వేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

న్యూస్‌క్లిక్ ఆఫీస్‌కు సీల్