Page Loader
Budget 2025 : 'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' గురజాడ పద్యంతో నిర్మలా బడ్జెట్ ప్రారంభం
'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' గురజాడ పద్యంతో నిర్మలా బడ్జెట్ ప్రారంభం

Budget 2025 : 'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' గురజాడ పద్యంతో నిర్మలా బడ్జెట్ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2025
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించిన భారతదేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ రోజు ఆమె తన ఎనిమిదో బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీంతో భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె పేరును రికార్డు గ్రంథాలలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కుంభమేళాలో జరిగిన ఘటనా దుర్ఘటనపై చర్చ జరగాలని వారు పట్టుబట్టారు. అయితే వివక్షాల ఆందోళన మధ్యనయినా నిర్మలమ్మ బడ్జెట్‌ను సభకు సమర్పించారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, 'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' అని గురజాడ అప్పారావు రాసిన కవితను ఉటంకించారు.

Details

బడ్జెట్

భారతదేశం 'వికసిత భారత్‌' లక్ష్యంతో ముందుకు వెళ్ళిపోతుందని ప్రకటించారు. అలాగే గతంలో చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. భారత్‌ను అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాలలో ఒకటిగా గుర్తించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను 'సున్నా శాతం పేదరికం' లక్ష్యంగా, 'పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్' పేరుతో ప్రవేశపెట్టారని తెలిపారు. ఇన్‌ఫ్రా అభివృద్ధి, మధ్య తరగతి ప్రజల వికాసంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, గత 10 సంవత్సరాలలో దేశం సాధించిన వృద్ధి అనేక అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. సమతుల్య అభివృద్ధి, సమ్మిళిత వృద్ధిని లక్ష్యంగా రాబోయే 5 సంవత్సరాలను ఒక ప్రత్యేక అవకాశంగా భావిస్తున్నట్లు నిర్మలమ్మ స్పష్టం చేశారు.