Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్
సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదు.ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఒకే పన్ను రేట్లను కొనసాగించనున్నట్లు సీతారామన్ చెప్పారు. గత బడ్జెట్ 2023లో సీతారామన్ మధ్యతరగతిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత ఆదాయపు పన్నుపై అనేక మార్పులను ప్రకటించారు. ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కానీ, స్వల్ప వెసులుబాటును వెల్లడించారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారు, రూ. 7లక్షల వార్షిక ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.