Lok Sabha: నేడు లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.
ఇటీవలే ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
ప్రస్తుతం దేశంలో 60 ఏళ్ల కిందటి ఆదాయపు పన్ను చట్టమే అమలులో ఉంది.
దీని స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది.
శనివారం ఈ మేరకు మాట్లాడిన నిర్మలా సీతారామన్, త్వరలో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలిపారు.
బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత హౌస్ ప్యానెల్‌కు సమీక్ష కోసం పంపబడుతుంది.
ప్రధాన లక్ష్యం ప్రస్తుత పన్ను చట్టాలను సరళీకృతం చేయడం అని స్పష్టం చేశారు.
వివరాలు
మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
అయితే,కొత్త సెస్సును ప్రవేశపెట్టే యోచన లేదని తెలిపారు.కొత్త బిల్లులో అనేక సవరణలు ఉంటాయని, అవి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.
2024జూలైలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా సీతారామన్,ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు.
1961 నాటి చట్టాన్ని సమీక్షించి,కొత్త బిల్లు ప్రస్తుత వ్యవస్థను సమూలంగా మారుస్తుందని,ప్రత్యక్ష పన్ను చట్టాలను మరింత సులభతరం చేస్తుందని వివరించారు.
జనవరి 31న ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి విడత ఫిబ్రవరి 13న ముగియనుంది.
రెండో విడత మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగనుంది.ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా,ఐటీ చట్టాన్ని సులభతరం చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.