Page Loader
Nitish Kumar: 'ఇండియా' కూటమి కథ ముగిసింది: నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్ 
Nitish Kumar: 'ఇండియా' కూటమి కథ ముగిసింది: నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్

Nitish Kumar: 'ఇండియా' కూటమి కథ ముగిసింది: నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Feb 17, 2024
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిపక్ష ఇండియా కూటమిపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్ చేశారు. కూటమిలో సీట్ల సర్దుబాటు సమస్యగా మారిన అంశంపై నితీష్ కుమార్‌ను విలేకరులు అడగ్గా.. 'ఇండియా' కూటమి కథ ఎప్పుడో ముగిసిందంటూ విమర్శించారు. కూటమిలో పొత్తుల వ్యవహారం గురించి చర్చించి చాలా చాలా కాలమైందన్నారు. చాలా పార్టీలు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. భారతరత్న దివంగత కర్పూరీ ఠాకూర్ వర్ధంతి వేడుకలకు వచ్చిన నితీష్ కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యంగా నితీష్ కోసం తమ తలుపులు తెరిచి ఉన్నాయని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ప్రకటనపై నితీశ్ కుమార్ స్పందించారు. లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలను నితీష్ కొట్టిపారేశారు.

బిహార్

ఆర్జేడీ మంత్రుల శాఖలపై విచారణకు ఆదేశించాం: నితీష్ కుమార్

అసెంబ్లీ కాంప్లెక్స్‌లో లాలూను కలవడం యాదృచ్ఛికంగా జరిగిందని నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. ఎవరినైనా కలిసినప్పుడు పలకరించుకుంటామని చెప్పారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది? ప్రశ్నించారు. అలాగే, మహాకూటమి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జరిగిన అక్రమాలపై సీరియస్‌గా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నితీష్ అన్నారు. ఆర్జేడీ మంత్రుల శాఖల్లో గత ఏడాది పని తీరును సమీక్షించాలని తాను ఆదేశించినట్లు చెప్పారు. విచారణ జరిపి చర్యలు కూడా తీసుకుంటామన్నారు. తాము ఎలాంటి తప్పులను కూడా అనుమతించబోమన్నారు. రాహుల్ గాంధీ బీహార్ పర్యటనపై కూడా నితీష్ కుమార్ ఘాటుగా స్పందించారు. తాము ఇద్దరం కలిసినప్పుడు రాహుల్ గాంధీ కుల గణనపై ఏమీ మాట్లాడలేదన్నారు. ఇప్పుడు మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు.