Page Loader
Andhra Pradesh: ఏసీఏ నుంచి నితీశ్‌ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి
ఏసీఏ నుంచి నితీశ్‌ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి

Andhra Pradesh: ఏసీఏ నుంచి నితీశ్‌ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2024
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) తరఫున యువ క్రికెటర్‌ నితీష్ కుమార్‌ రెడ్డికి అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో చోటు పొందిన నితీశ్‌ను అభినందించారు. ఆల్‌రౌండర్‌గా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో అతని అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో సీఎం చేతుల మీదుగా నితీశ్‌కు నగదు బహుమతిని అందించనున్నట్టు చెప్పారు. ఈ సమయంలో ఇలాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు.

Details

అమరావతిలో స్టేడియాన్ని నిర్మిస్తాం

నితీశ్‌ అందరికీ ఆదర్శవంతమైన వ్యక్తిగా మారిపోయారని వ్యాఖ్యానించారు. క్రికెట్‌ అభివృద్ధి కోసం అమరావతిలో అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియం నిర్మిస్తామన్నారు. అలాగే విశాఖపట్నం స్టేడియాన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సిద్దం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎల్‌ టీమ్‌ స్థాపించే ఆలోచనను కూడా ఏసీఏ ప్రకటించింది.