Modi 3.0: మోడీ 3.0లో నితీష్ కుమార్ పార్టీకి 2 కేబినెట్ బెర్త్‌లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో జనతాదళ్ (యునైటెడ్)కి రెండు శాఖలు లభిస్తాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ అనే ఇద్దరు సీనియర్ నేతల పేర్లను పార్టీ ప్రతిపాదించింది. లాలన్ సింగ్ బీహార్ ముంగేర్ నుంచి లోక్ సభకు ఎన్నిక కయ్యారు. రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఠాకూర్ భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు. రేపు (ఆదివారం) ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ముందు కేబినెట్ బెర్త్‌లపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) సమావేశంలో తీసుకున్నారు. మరో భాగస్వామ్య పక్షం తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి వుంది.