NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'భయపడి జన్ ఆశీర్వాద యాత్రకు నన్ను ఆహ్వానించలేదు'.. బీజేపీపై ఉమాభారతి కామెంట్ 
    తదుపరి వార్తా కథనం
    'భయపడి జన్ ఆశీర్వాద యాత్రకు నన్ను ఆహ్వానించలేదు'.. బీజేపీపై ఉమాభారతి కామెంట్ 
    'భయపడి జన్ ఆశీర్వాద యాత్రకు నన్ను ఆహ్వానించలేదు'.. బీజేపీపై ఉమాభారతి కామెంట్

    'భయపడి జన్ ఆశీర్వాద యాత్రకు నన్ను ఆహ్వానించలేదు'.. బీజేపీపై ఉమాభారతి కామెంట్ 

    వ్రాసిన వారు Stalin
    Sep 04, 2023
    11:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రకు ఆహ్వానం అందకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి ఆవేదన వ్యక్తం చేశారు.

    తనను జన్ ఆశీర్వాద యాత్రకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. కనీసం సమాచారమైనా ఇచ్చి ఉండాల్సిందని ఉమాభారతి అన్నారు.

    తాను జన్ ఆశీర్వాద యాత్రలో ఉంటే, ప్రజల దృష్టి మొత్తం తనపైనే ఉంటుందని బీజేపీ నాయకులు భయపడి ఉండవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.

    జ్యోతిరాదిత్య సింధియా 2020లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తే, తాను కూడా 2003లో పార్టీని ఎక్కువ సీట్లలో గెలిపించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించినట్లు వెల్లడించారు.

    మధ్యప్రదేశ్‌లో బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రను ఆదివారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు.

    బీజేపీ

    బీజేపీ సీనియర్లను అవమానిస్తోంది: కాంగ్రెస్

    జన్ ఆశీర్వాద యాత్రకు తనకు ఆహ్వానం అందనప్పటికీ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తానని ఉమాభారతి స్పష్టం చేశారు.

    ఉమాభారతి ఒకప్పుడు పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీకి విధేయురాలుగా ఉండేవారు. ఉమాభారతిని ఎందుకు ఆహ్వానించలేదనే విషయంపై బీజేపీ ఇంకా స్పందించలేదు.

    బీజేపీ ఎదుగుదలలో కీలకమైన రామజన్మ భూమి ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన నేతల్లో ఉమాభారతి ఒకరు.

    అంతటి సీనియర్ నేతను పక్కన పెట్టడంపై కాంగ్రెస్ స్పందించింది. కావాలనే సీనియర్లను బీజేపీ అవమానిస్తోందని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు.

    మాజీ ఉపప్రధాని అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీని కూడా పార్టీ పక్కన పెట్టిందన్నారు. భారతీయ సంస్కృతిలో పెద్దలను గౌరవించని వారిని దేవుడు కూడా క్షమించడని సూర్జేవాలా పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    బీజేపీ
    జ్యోతిరాదిత్య సింధియా
    జేపీ నడ్డా

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    మధ్యప్రదేశ్

    హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు హైదరాబాద్
    ఇండియన్ రైల్వేస్ కి ఏమైందీ..మళ్లీ పట్టాలు తప్పిన రైలు.. ఈసారి ఆయిల్ ట్యాంకర్ రైలు ప్రమాదం
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం  భోపాల్
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు  భోపాల్

    బీజేపీ

    INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు
    No confidence motion: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్  కాంగ్రెస్
    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం లోక్‌సభ
    No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?  అవిశ్వాస తీర్మానం

    జ్యోతిరాదిత్య సింధియా

    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు? రాహుల్ గాంధీ

    జేపీ నడ్డా

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025