LOADING...
Nellore: డిసెంబర్ 18న నెల్లూరు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం.. కలెక్టర్ అధికారిక ప్రకటన 
డిసెంబర్ 18న నెల్లూరు మేయర్‌పై

Nellore: డిసెంబర్ 18న నెల్లూరు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం.. కలెక్టర్ అధికారిక ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగుతున్న వేళ, మేయర్ పొట్లూరి స్రవంతిపై డిసెంబర్ 18న అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు అధికారికంగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో 42 మంది తెదేపాకు మద్దతు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలన్న డిమాండ్‌తో కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం నోటీసులు సమర్పించగా, కలెక్టర్ అధికారికంగా తీర్మానం తేదీని ప్రకటించారు.

Details

54 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలుపు

నెల్లూరులోని 54 డివిజన్లలో అన్ని చోట్లా వైసీపీ కార్పొరేటర్లు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం ఈ కార్పొరేటర్లలో 40 మందికిపైగా తెదేపాలో చేరడం కీలక రాజకీయ మార్పుగా నిలిచింది. దీంతో మేయర్‌పై అవిశ్వాసానికి మార్గం సుగమమైంది.

Advertisement