Nitin Gadkari: కులం పేరుతో విభజన వద్దు.. నితన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
"ఎవరు కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మరోసారి తనదైన శైలిలో కుల రాజకీయాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సమాజాన్ని కుల, మతాల పేరుతో విభజించే నాయకులకు హెచ్చరిక జారీ చేస్తూ, ఇలాంటి వ్యాఖ్యలను సహించమని స్పష్టం చేశారు. అభివృద్ధికి కులమతాల అడ్డుగోడలు ఉండవని గడ్కరీ పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి సౌకర్యాలు హిందువులకు ఏ ధరకు అందుతాయో, ముస్లిములకూ అదే ధరకు అందుతాయని గుర్తుచేశారు. అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా లభిస్తున్న వేళ కుల రాజకీయాలకు స్థానం లేదని తేల్చిచెప్పారు
వివరాలు
నేను ఎప్పుడూ నిజాయతీగా ఉంటా
ఈ సందర్భంగా రాజకీయాల్లో కనిపిస్తున్న ద్వంద్వ వైఖరిని కూడా ఆయన ఎండగట్టారు. బహిరంగ వేదికలపై కులాల గురించి మాట్లాడే కొందరు నేతలు, వ్యక్తిగతంగా తనను కలిసినప్పుడు మాత్రం తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇప్పించమని అడుగుతారని విమర్శించారు. ఇలాంటి ద్వంద్వ ప్రవర్తన గల నాయకులను ప్రజలు ఇప్పటికే గుర్తించారని వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ నిజాయితీగా, నేరుగా మాట్లాడతానని గడ్కరీ తెలిపారు. తాను చెప్పిన పనిని చేయలేదని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని విశ్వాసం వ్యక్తం చేశారు.
వివరాలు
కార్మికులకు తగిన గౌరవం ఇవ్వాలి
ఇక దేశ నిర్మాణంలో కార్మికుల పాత్రను కూడా ఆయన ప్రశంసించారు. దేశ ప్రగతి కేవలం యంత్రాల వల్ల కాకుండా, లక్షలాది కార్మికుల శ్రమ ఫలితమేనని అన్నారు. రహదారులు, భవనాలు, నీటిపారుదల ప్రాజెక్టులు కార్మికుల కష్టం వల్లే సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశాభివృద్ధికి వెన్నెముకలైన కార్మికులకు తగిన గౌరవం, అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ స్పష్టం చేశారు.