Page Loader
Wikimedia Foundation: గత రెండు రోజులుగా మేము ఎలాంటి ప్రభుత్వ నోటీసులు అందుకోలేదు: వికీమీడియా ఫౌండేషన్ 
గత రెండు రోజులుగా మేము ఎలాంటి ప్రభుత్వ నోటీసులు అందుకోలేదు: వికీమీడియా ఫౌండేషన్

Wikimedia Foundation: గత రెండు రోజులుగా మేము ఎలాంటి ప్రభుత్వ నోటీసులు అందుకోలేదు: వికీమీడియా ఫౌండేషన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

వికీపీడియా (Wikipedia)కు భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. తాము భారత ప్రభుత్వంనుంచి ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని వికీపీడియా మాతృ సంస్థ వికీమీడియా ఫౌండేషన్‌ (Wikimedia Foundation) స్పష్టం చేసింది. ఈమేరకు సంస్థ ప్రతినిధుల్లో ఒకరు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా వాలంటీర్లు

'వికీపీడియా ఎడిటింగ్‌ విధానాలు, కంటెంట్‌ నాణ్యతకు సంబంధించి భారత ప్రభుత్వంనుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. వికీపీడియా వాలంటీర్లు సైట్‌లో సమాచారం అప్‌లోడ్ చేస్తారు, అది కూడా విశ్వసనీయ వార్తా వనరులు, ప్రముఖ ప్రచురణల నుంచే సేకరించినదే. అందుకే మా ఆర్టికల్స్‌లోనూ ఎక్కువమంది విశ్వసనీయత కలిగి ఉంటారు.ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా వాలంటీర్లు వికీపీడియాకు కంటెంట్‌ అందిస్తున్నారు,అందులో ఎక్కువ మంది భారతీయులే. మా సంస్థ నిబద్ధతల ప్రకారం తటస్థంగా,సంపాదకీయ నియమాలను పాటిస్తూ కంటెంట్‌ తయారుచేస్తాం. రాజకీయ నేపథ్యం ఉన్న అనేక మంది వాలంటీర్లు కూడా మా సంస్థలో భాగస్వాములు. ప్రతి ఆర్టికల్‌ వాస్తవాధారాలతో సుదీర్ఘంగా రాస్తాం, ఆ సమాచారానికి సంబంధించిన వనరుల వివరాలను ఆర్టికల్‌ పేజీల్లో ఉంచుతాం' అని సంస్థ ప్రతినిధి తెలిపారు.

వివరాలు 

తప్పుడు సమాచారం ఉందన్న ఆరోపణలపై కేంద్రం నోటీసులు

ప్రతినెల 850 మిలియన్ల మంది భారతీయులు మా సైట్‌ను సందర్శిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం వికీపీడియా భారత్‌లో చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కొన్ని వార్తా సంస్థలు, ప్రత్యేకించి ఏఎన్‌ఐ వేసిన దావా కారణంగా, దిల్లీ హైకోర్టు వికీపీడియాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరైనా ఎడిట్‌ చేసుకొనే సదుపాయం 'ప్రమాదకరం' అని పేర్కొంది. అయితే, వికీపీడియా చట్టపరమైన మార్గదర్శకాల ప్రకారం కంటెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపింది. తాజా పరిణామంలో, వికీపీడియా సమాచారంలో పక్షపాత ధోరణి, తప్పుడు సమాచారం ఉందన్న ఆరోపణలపై కేంద్రం నోటీసులు జారీ చేసింది.