LOADING...
Visakhapatnam: ఈ నగరంలో 'నో హెల్మెట్‌-నో పెట్రోల్‌'.. కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు
ఈ నగరంలో 'నో హెల్మెట్‌-నో పెట్రోల్‌'.. కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు

Visakhapatnam: ఈ నగరంలో 'నో హెల్మెట్‌-నో పెట్రోల్‌'.. కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

హెల్మెట్‌ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం పోయరాదని పోలీసు అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. బాధ్యతాయుతమైన రైడింగ్‌ను ప్రోత్సహించడం, నగర రహదారులపై మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ చర్య ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రాథమిక రహదారి భద్రతా నిబంధనల అమలును కఠినతరం చేయడం కోసమేనని విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ శంక బ్రత బాగ్చీ స్పష్టం చేశారు. 'నో హెల్మెట్‌-నో పెట్రోల్‌' నిబంధన కేవలం నియంత్రణ చర్య కాదని, ఇది ప్రాణాలను కాపాడే కీలక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. రైడర్‌తో పాటు వెనుక కూర్చునే పిలియన్‌ రైడర్‌ కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని తెలిపారు.

Details

తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి

ద్విచక్రవాహనదారులు ఉపయోగించే హెల్మెట్లు తప్పనిసరిగా బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) సర్టిఫికేషన్‌తో పాటు జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన ఐఎస్ఐ మార్క్‌ను కలిగి ఉండాలని కమిషనర్‌ వెల్లడించారు. ఈ కొత్త నిబంధనకు మద్దతుగా విశాఖపట్నం నగరవ్యాప్తంగా అనేక పెట్రోల్‌ బంకుల్లో హెల్మెట్‌ వినియోగాన్ని ప్రోత్సహించే సైన్‌ బోర్డులను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 'రైడర్లు మాత్రమే కాకుండా పిలియన్‌ రైడర్‌ కూడా హెల్మెట్‌ ధరించాలి. వారి భద్రత కూడా అంతే ముఖ్యం' అని సీపీ బాగ్చీ మరోసారి నొక్కి చెప్పారు. విశాఖ నగర పోలీసులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025లో నగరంలో మొత్తం 1,086 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.

Details

ట్రాఫిక్‌ పోలీసులు పలు ప్రత్యేక డ్రైవ్‌లు

ఏడాది పొడవునా మోటారు వాహనాల చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్‌ పోలీసులు పలు ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించినప్పటికీ, హెల్మెట్‌ ధరించకపోవడం సమస్యగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత కఠిన చర్యలు తప్పనిసరి అవుతున్నాయని పేర్కొన్నారు. అన్ని పెట్రోల్‌ బంకుల యజమానులు, నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. హెల్మెట్‌ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్‌ పోయరాదని స్పష్టం చేశారు. ఈ నిబంధనను పెట్రోల్‌ బంకులు ఉల్లంఘించినట్లు తేలితే ముందుగా హెచ్చరికలు జారీ చేస్తామని, నిబంధనలు పాటించని పక్షంలో పోలీసు శాఖ నుంచి అధికారిక నోటీసులు అందుతాయని ఆయన హెచ్చరించారు

Advertisement

Details

ప్రణాళికబద్ధంగా అవగాహన కార్యక్రమాలు

. 'క్రమం తప్పకుండా తనిఖీలు, జరిమానాలు, డ్రైవింగ్‌ లైసెన్సుల సస్పెన్షన్లు ఉన్నప్పటికీ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. హెల్మెట్‌ నిబంధనపై పౌరుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో నగర పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించనున్నారని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement