BRS Supports Delimitation Bill: తెలంగాణకు అన్యాయం జరగదు.. డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ జై!
ఈ వార్తాకథనం ఏంటి
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుపై తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని భారత్ రాష్ట్ర సమితి (BRS) నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు.
వివరాలు
తెలంగాణకు ఎంపీ సీట్లు 26కు పెరుగుతాయ్
డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి మొదటి నుంచీ స్పష్టంగానే ఉంది.
పార్లమెంట్‌లో దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యంలో ఎలాంటి కోత ఉండకూడదని, తెలంగాణకు ఏమాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదని మొదటి నుంచీ పోరాడుతున్నాం.
పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం వాటాను కచ్చితంగా కాపాడాలని నిరంతరం డిమాండ్ చేస్తూ వచ్చాం.
కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదనలో రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు మార్చకుండా రక్షణ కల్పించడం ద్వారా మా ప్రధాన ఆందోళనకు పరిష్కారం లభించింది.
వివరాలు
తర
అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడం వల్ల తెలంగాణలో ఎంపీ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరగనుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ పార్లమెంట్‌లో ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మా ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఓటు వేస్తారు.
మహిళా రిజర్వేషన్లకు కూడా మేం ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నాం. వాటి అమలుకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం'' అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.