Telangana Weather: వర్షాల్లేవు.. నవంబర్ మండనున్న వరకు ఎండలు
తెలంగాణలో ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతేడాది మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మాత్రం జూన్ 20 తర్వాత ఏర్పడ్డాయి. దీంతో జూన్‌లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. ఇక జులై చివరి వారంలో వర్షాలు దంచికొట్టడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఇక ఆగస్టులో వర్షాలు ఫర్వాలేదనిపించినా, సెప్టెంబర్‌లో మాత్రం బాగానే బాగానే కురిశాయి. అక్టోబర్ 17న తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 2020, 2021, 2022లో రుతుపవనాలు వరుసగా అక్టోబర్27, అక్టోబర్ 20, అక్టోబర్ 22 తేదీల్లో జరిగింది.
ఈ ఏడాది వర్షాలు కురవలేదు : ఐఎండీ
గత కొన్నేళ్లుగా అక్టోబర్ మొదటి వారంలోనే వర్షాలు కురిసేవని, ఈ ఏడాది మాత్రం వర్షాలు కురవలేదని ఐఎండీ అధికారులు తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారం మాదిరిగా ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు తెలిపారు. నవంబర్ రెండో వారం వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండనున్నాయి. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఇప్పటివరకూ 0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.