Page Loader
Kolkata RG Kar hospital: కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అత్యాచారం జరగలేదా? CFSL సంచలన నివేదిక
కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అత్యాచారం జరగలేదా? CFSL సంచలన నివేదిక

Kolkata RG Kar hospital: కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అత్యాచారం జరగలేదా? CFSL సంచలన నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2024
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం కేసులో నమ్మశక్యంకాని విషయాలు వెలుగుచూశాయి. వైద్యురాలైన ఆమె మృతదేహాన్ని గుర్తించిన నాలుగవ అంతస్తులోని సెమినార్ రూమ్‌లో అత్యాచారం,హత్య జరిగిందనే ఆధారాలు సెంట్రల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ లేబోరేటరీ (సీఎఫ్‌ఎస్ఎల్) నివేదికలో బయటపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్లు ఎలాంటి ఆధారాలు కనుగొనబడలేదని నివేదిక పేర్కొంది. నేరం చోటు చేసుకున్న ప్రదేశం సెమినార్ రూమ్ కాకపోవచ్చునని సందేహాలను వ్యక్తం చేసింది.

వివరాలు 

వైద్యురాలితో దాడి చేసిన వ్యక్తికి మధ్య ఎలాంటి గొడవ లేదా దాడి జరిగిందనే ఆధారాలు లేవు 

సెమినార్ గదిలోని నీలి రంగు పరుపుపై వైద్యురాలితో దాడి చేసిన వ్యక్తికి మధ్య ఎలాంటి గొడవ లేదా దాడి జరిగిందనే ఆధారాలు దొరకలేదని నివేదిక స్పష్టం చేసింది. రూమ్ లోపల మరెక్కడా ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిపింది. ఈ నివేదికను సీబీఐకి అందించింది. ఈ ఏడాది ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ మృతదేహం గుర్తించబడిన విషయం తెలిసిందే. మొదట కోల్‌కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టిన తర్వాత, ఈ కేసును సీబీఐకి అప్పగించారు.