Page Loader
Diwali Accident : పండుగ పూట రోడ్డు ప్రమాదాలు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు
పండుగ పూట రోడ్డు ప్రమాదాలు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు

Diwali Accident : పండుగ పూట రోడ్డు ప్రమాదాలు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 13, 2023
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి పండుగ పూట గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్లు అతివేగంగా కారు నడిపి రోడ్లపై భయాంభంత్రులకు గురి చేశారు. సీసీ కెమెరాలతో రెండు కేసుల్లోని వాహనాలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. మొదటి ఘటన నోయిడాలోని సెక్టార్ 119 లోని గత రాత్రి ఆల్డికో ఇన్విటేషన్ సొసైటీలో గేట్ నంబర్ 2 వద్ద నమోదైంది. సొసైటీ బయట బాణాసంచా కాల్చుతుండగా, ఓ కారు డ్రైవర్ అతివేగంగా వెళ్తూ రోడ్డుపై ఉన్నవారిని కారుతో ఢీకొట్టాడు. ఘటనలో గాయపడిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

details

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు

రెండో ఘటన బిస్రఖ్ పరిధిలోని గౌర్ సిటీ-2 సమీపంలో జరిగింది. దీపావళి రాత్రి వెస్ట్‌లోని గౌర్ సిటీ 7 అవెన్యూ సమీపంలో డ్రైవర్ మద్యం మత్తులో రోడ్డు పక్కన నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డుపైకి ఎక్కించాడు. సెక్యూరిటీ గార్డు తప్పించుకున్నప్పటికీ ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో కారు డ్రైవర్‌ను బిస్రాఖ్ పోలీసులు చేజ్ చేసి అరెస్ట్ చేశారు. నిందితుడు డ్రైవర్‌ను సెక్టార్ 119 ఎల్డిగో ఇన్విటేషన్ సొసైటీ నివాసి సిద్ధార్థ్‌గా పోలీసులు గుర్తించారు. ఆ డ్రైవర్ కారును అతివేగంగా నడుపుతూ చాలా మందిని గాయపరిచినట్టు సమాచారం. సెక్టార్ 113,సెక్టర్ 119 పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయని ఘటనపై ఏడీసీపీ నోయిడా శక్తి అవస్థి తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్రేటర్ నోయిడా పరిధిలో హిట్ అంట్ రన్