Loading...
Nitin Gadkari: రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం లేదు.. రిటైర్మెంట్‌ వార్తలపై గడ్కరీ క్లారిటీ!
రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం లేదు.. రిటైర్మెంట్‌ వార్తలపై గడ్కరీ క్లారిటీ!

Nitin Gadkari: రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం లేదు.. రిటైర్మెంట్‌ వార్తలపై గడ్కరీ క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాను రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఖండించారు. అవన్నీ తప్పుడు కథనాలని, వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని తెలిపారు.

వివరాలు

యువతకు బాధ్యతలు అప్పగించాలన్నదే నా ఉద్దేశం

''వయసు పెరిగే కొద్దీ యువతను ముందుకు తీసుకురావాలని చెబుతుంటాను. అంతమాత్రాన నేను పదవి నుంచి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని అర్థం కాదు.

గత తరాల వారు తమ బాధ్యతలను మనకు అప్పగించారు. అదే విధంగా మనం కూడా మన తర్వాతి తరాలకు బాధ్యతలు అందించాలి.

అది ఉద్యోగం కావచ్చు.. వ్యాపారం కావచ్చు. ప్రస్తుతం జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారి స్థానాల్లో గతంలో మరొకరు ఉండేవారు.

ఇప్పుడు మీరు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే నేను కూడా ప్రభుత్వ తరఫున పనిచేస్తూనే ఉంటా. గతంలో నేను చేసిన వ్యాఖ్యలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని గడ్కరీ వివరించారు.

వివరాలు

ట్రస్ట్‌ బాధ్యతల గురించే మాట్లాడా..

నాగ్‌పుర్‌లో తాను ఏర్పాటు చేసిన లక్ష్మణ్‌రావ్‌ మన్కర్‌ ట్రస్ట్‌ గురించి మాత్రమే గతంలో మాట్లాడానని గడ్కరీ స్పష్టం చేశారు.

ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆ ట్రస్ట్‌ విషయంలో తాను గతంలో మాదిరిగా బాధ్యతలు నిర్వహించలేనని, యువతకు అవకాశం ఇవ్వాలని సభ్యులకు సూచించినట్లు వివరించారు.

అయితే మీడియా ఛానళ్లు ఈ వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టాయని గడ్కరీ పేర్కొన్నారు.

ADVERTISEMENT