Page Loader
ప్రధాని మోదీ సమక్షంలో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం
ప్రధాని మోదీ సమక్షంలో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

ప్రధాని మోదీ సమక్షంలో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

వ్రాసిన వారు Stalin
Mar 07, 2023
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా మంగళవారం మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా ప్రిస్టోన్ టైన్‌సాంగ్, స్నియాభలాంగ్ ధర్ ప్రమాణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి, అమిత్ షా, నడ్డా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులుగా అబూ తాహెర్ మోండల్, కిర్మెన్ షిల్లా, మార్క్యూస్ ఎన్ మారక్, రక్కమ్ ఎ సంగ్మా, అలెగ్జాండర్ లాలూ హెక్, డాక్టర్ అంపరీన్ లింగ్డో, పాల్ లింగ్డో, కమింగోన్ యంబోన్, షక్లియార్ ప్రమాణ స్వీకారం చేశారు. మేఘాలయలో ఎన్‌పిపి నేతృత్వంలోని కూటమి, 45మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ బెర్తుల్లో ఎనిమిది ఎన్‌పిపికి, రెండు యూడీపీ, బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీపీకి ఒక్కొక్కటి దక్కుతాయి.

ఎన్‌పీపీ

26 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్‌పీపీ

మొత్తం 60స్థానాలుకు అసెంబ్లీ ఎన్నికలు జరగగ్గా ఎన్‌పీపీ 26 స్థానాలను గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. వరుసగా రెండోసారి ఆయన సీఎం పీఠాన్ని అధిష్ఠంచబోతున్నారు.యూడీపీ 11 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది. గత అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకున్న తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ఐదు సీట్లు వచ్చాయి.బీజేపీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, హిల్‌ స్టేట్‌ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలు చెరో రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి నాలుగు సీట్లు వచ్చాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగ్మా