LOADING...
NEET Leak Case: నీట్‌ పేపర్‌ లీక్‌.. సుప్రీం కోర్టులో ఎన్‌టీఏ అఫిడవిట్
నీట్‌ పేపర్‌ లీక్‌.. సుప్రీం కోర్టులో ఎన్‌టీఏ అఫిడవిట్

NEET Leak Case: నీట్‌ పేపర్‌ లీక్‌.. సుప్రీం కోర్టులో ఎన్‌టీఏ అఫిడవిట్

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. నీట్‌తో పాటు తమ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని పరీక్షలను పారదర్శకంగా, విశ్వసనీయంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు అందులో పేర్కొంది. నీట్‌ పరీక్షకు ముందు ఏప్రిల్‌ 17న జరిగిన ఉన్నతస్థాయి సమావేశం వివరాలను కూడా ఎన్‌టీఏ తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పరీక్షలకు ముందు,అనంతరం అనుసరించాల్సిన విధానాలపై ఉన్నతస్థాయి కమిటీ పలు సూచనలు చేసినట్లు తెలిపింది. ఆ సూచనల్లో కొన్ని ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

వివరాలు 

ప్రశ్నపత్రాల లీకేజీలు,పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు కేంద్ర విద్యాశాఖతో కలిసి పనిచేస్తున్న ఎన్‌టీఏ

పరీక్షల నిర్వహణలో సమన్వయం,పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు,జిల్లా స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. నీట్‌ పరీక్ష నిర్వహించే సమయానికి 18రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు,621జిల్లా స్థాయి సమన్వయ కమిటీలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు వివరించింది. ప్రశ్నపత్రాల లీకేజీలు,పరీక్షల్లో అక్రమాలు వంటి ఘటనలను అరికట్టేందుకు కేంద్ర విద్యాశాఖతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపింది. పరీక్షల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పలు చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా,ఈ ఏడాది మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ పట్టభద్ర పూర్వ వైద్య ప్రవేశపరీక్ష-2026కు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.

Advertisement